బ్యూరోఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ తెలంగాణ హెడ్ పీవీ శ్రీకాంత్
దుబ్బాక: వస్తువుల ఎంపికలో నాణ్యత, భద్రతా ప్రమాణాలే అత్యంత కీలకమని బ్యూరోఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ తెలంగాణ హెడ్ అండ్ డైరెక్టర్ పీవీ శ్రీకాంత్ స్పష్టం చేశారు. అక్టోబర్ 14న ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం దుబ్బాక పీఎంశ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో బీఐఎస్ ఆధ్వర్యంలో మనక్ మహోత్సవ్– 2026 నిర్వహించారు. ఈ సందర్భంగా వస్తువుల నాణ్యతా ప్రమాణాల గుర్తింపుపై విద్యార్థు లకు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ... ప్రస్తుత మార్కెట్లో నాసిరకం ఉత్పత్తులకు బ్రాండ్ ముసుగువేసి విచ్చలవిడిగా విక్రయిస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీఐ ఎస్ జాయింట్ డైరెక్టర్ వివేక్ ప్రకాశ్, ఎంఈఓ ప్రభుదాసు తదితరులు ఉన్నారు.


