చేనేతకు సర్కారు చేయూత | - | Sakshi
Sakshi News home page

చేనేతకు సర్కారు చేయూత

Sep 30 2026 7:42 AM | Updated on Sep 30 2026 7:42 AM

కార్పొరేషన్‌ చైర్మన్లు రమణ, శ్రీనివాస్‌

కార్పొరేషన్‌ చైర్మన్లు రమణ, శ్రీనివాస్‌

సిద్దిపేటజోన్‌: రాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమలో ఉపాధి పొందుతున్న కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తోందని రాష్ట్ర హ్యాండ్లూమ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వెంకటరమణ, రాష్ట్ర పద్మశాలీ కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆదర్శ చేనేత సొసైటీ సందర్శించారు. సంఘం వార్షిక సమావేశంలో వారు మాట్లాడుతూ.. సిద్దిపేట గొల్లభామకు పెట్టింది పేరుగా అభివర్ణించారు. సిద్దిపేట ప్రాంత చేనేత కార్మికుల వృత్తి నైపుణ్యం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిందన్నారు. చేనేత కార్మికుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. క్రిప్ట్‌ పథకం కింద నిధులు మంజూరు, క్యాష్‌ క్రెడిట్‌ ద్వారా చేనేత సహకార సంఘాలకు రూ. 20లక్షల చొప్పున విడుదల చేయడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement