బీసీల హక్కుల సాధనకు ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

బీసీల హక్కుల సాధనకు ఉద్యమం

Sep 30 2026 7:42 AM | Updated on Sep 30 2026 7:42 AM

దుబ్బాక: బీసీల హక్కుల సాధన కోసం రాజకీయాలకు అతీతంగా మరో ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని బీసీ సంఘాల అఖిల పక్షం నాయకులు స్పష్టం చేశారు. మంగళవారం దుబ్బాకలో అన్ని రాజకీయపార్టీల బీసీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్టోబర్‌9న దుబ్బాక నియోజకవర్గంలో బీసీ ల హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఉద్యమంలో బీసీ సర్పంచ్‌లు, ఉప సర్పంచులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలన్నారు సమావేశంలో నాయకులు బంగారయ్య, మచ్చ శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement