● డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ ● పీహెచ్సీల సూపర్వైజర్లతో సమావేశం
సిద్దిపేటకమాన్: సీజనల్ వ్యాధులు, చికున్గున్యా, మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సూపర్వైజర్లతో డీఎంహెచ్ఓ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జ్వర లక్షణాలు ఉన్న వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్స అందించాలని సూచించారు. మాతాశిశు సంక్షేమ కార్యక్రమం, వ్యాధి నిరోధక టీకాల పంపిణీ, క్షయ వ్యాధి వంటి కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు. గర్భిణుల నమోదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ వినోద్బాబ్జి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శ్రీకాంత్, సోఫాన్ రాథోడ్, అనిల్కుమార్, పాషా పాల్గొన్నారు.


