‘గొర్రెల మేతకిచ్చిన భూములు ఇవ్వం’ | - | Sakshi
Sakshi News home page

‘గొర్రెల మేతకిచ్చిన భూములు ఇవ్వం’

Sep 29 2026 7:24 AM | Updated on Sep 29 2026 7:24 AM

అక్కన్నపేట(హుస్నాబాద్‌): గొర్రెల మేతకోసం కేటాయించిన భూమిలో ఎఫ్‌పీఓ సంస్థ గోదాం నిర్మిస్తామంటే ఊరుకోబోమని యాదవ సంఘం సభ్యులు సృష్టం చేశారు. అక్కన్నపేట మండలం గండిపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌ 97లో సుమారుగా 112ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. అందులో దాదాపుగా 50ఏళ్ల కిందట యాదవ కులస్తులకు 5ఎకరాల భూమిని గొర్రెల మంద, మేత మేసుకునేందుకు కేటాయించారు. ఈ నేపథ్యంలో గండిపల్లి, కుందనవానిపల్లి పరిధిలోని ప్రసిద్ధ రైతు ఉత్పత్తిదారుల సంఘానికి చెందిన గోదాం నిర్మించేందుకు ఇటీవల ఆ స్థలాన్ని పరిశీలించినట్లు సమాచారం. ఈ మేరకు సోమవారం గండిపల్లి యాదవ సంఘం అధ్యక్షుడు చౌదరి శ్రీనివాస్‌ అధ్వర్యంలో సుమారుగా 150మంది సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చౌదరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ మా తాత ముత్తాతల కాలం నుంచి గొర్రెల మందలతో పాటు మేతమేసుకుంటూ వస్తున్నామన్నారు. పలుమార్లు ఆర్డీఓ, మంత్రి పొన్నం ప్రభాకర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లామని, గోదాంను నిర్మించకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు నూకల సారయ్య, బాబురావులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement