గజ్వేల్: మాదిగల సమగ్ర అభివృద్ధి కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగే భవిష్యత్తు పోరాటాల్లో కీలకంగా వ్యవహరించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మంద కుమార్ మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఎమ్మార్పీఎస్ కమిటీ ఎన్నిక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ను సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కమిటీలను ఎన్నుకుంటున్నట్లు ప్రకటించారు. ఎంఎస్పీ రాష్ట్ర నాయకుడు మైస రాములు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా ఇన్చార్జి సామ్రాట్ ప్రకాశ్మాదిగ, ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు ముండ్రాతి క్రిష్ణ, నాయకులు ఉబ్బని ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కాగా ఎమ్మార్పీఎస్ కమీటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా చింతకింది యాదగిరి, మర్రికింది యాదగిరి, ఎంఎస్పీ కమీటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఈదుగాని యాదగిరి, పుంటికూర యాదగిరిలను ఎన్నుకున్నారు.


