అమ్మకు పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

అమ్మకు పరీక్షలు

Sep 28 2026 7:27 AM | Updated on Sep 28 2026 7:27 AM

హుస్నాబాద్‌రూరల్‌/వర్గల్‌(గజ్వేల్‌): గ్రామీణ మహిళలను అక్షరాస్యులను చేయడానికి సెర్ప్‌ ఆధ్వర్యంలో అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో ఆదివారం నిర్వహించిన పరీక్షకు 526 మంది మహిళలు హాజరయ్యారు. ఈ మేరకు ఏపీఎం తిరుపతి విలేకరులకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్షరం నేర్చుకొంటే ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందన్నారు. ఇంట్లో చదువుకున్న పిల్లలు అమ్మకు అక్షరాలు నేర్పించే బాధ్యతను తీసుకోవాలని చెప్పారు. మార్చిలో నిర్వహించిన పరీక్షల్లో 600 మంది మహిళలు పాల్గొని పరీక్షలు రాశారు. రెండవ విడత 526 మంది పరీక్షలు హాజరయ్యారు. వ్యవసాయ పనులు ఉన్నప్పటికీ మహిళలు ఉత్సాహంతో పరీక్షలకు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఉల్లాస్‌ పరీక్ష కేంద్రాల పరిశీలన

వర్గల్‌, గౌరారం గ్రామాలను ఆదివారం ఎన్‌సీఈఆర్‌టీ అధికారి(సీనియర్‌ కన్సల్టెంట్‌) యాచనా గుప్తా సందర్శించారు. ఆయా గ్రామాల్లో స్వయం సహాయక సంఘ మహిళలకు నిర్వహిస్తున్న ‘ఉల్లాస్‌’పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. పరీక్షకు హాజరైన మహిళలతో మాట్లాడారు. అంతకు ముందు వర్గల్‌ క్షేత్రం సందర్శించి అమ్మవారికి పూజలు నిర్వహించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement