పట్నం వేసి మొక్కులు తీర్చుకున్న భక్తులు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఆదివారం భక్తులు సందడి చేశారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు స్వామి వారి నామస్మరణతో మార్మోగాయి. ఉదయమే క్షేత్రానికి చేరుకున్న భక్తులు అభిషేకాలు, నిత్యకల్యాణం,ప్రత్యేకపూజలు, గంగిరేణు చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు గంగిరేణు చెట్టు ప్రాంగణంలో పట్నాలు వేసి మొక్కులు చెల్లించారు. భక్తులకు కావల్సిన ఏర్పాట్లను ఆలయ ఈఓ సుధాకర్రెడ్డి, ఏఈవో బుద్ది శ్రీనివాస్,పర్యవేక్షకులు చంద్రశేఖర్, ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్లు పర్యవేక్షించారు.


