బోగస్‌కు చెక్ బోగస్ ధ్రువీకరణ పత్రాలకు చెక్ పెడుతూ ప్రభుత్వం డిజిటల్ యాప్‌ను తీసుకొచ్చింది. వివరాలు 8లో u
మిరుదొడ్డిలో రేణుకాదేవి జమదగ్ని ఏకాదశ సిద్ధి హోమం అంగరంగ వైభవంగా సాగుతోంది. సోమవారం డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల శిగాల మధ్య భక్తులు అమ్మవారికి బోనాల జాతర నిర్వహించారు. యువకులు ఆట పాటలతో హోరెత్తించారు. అనంతరం వైదిక నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ మంగళవారం అమ్మవారి కల్యాణ మహోత్సవంతో పాటు అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
– మిరుదొడ్డి(దుబ్బాక)


