పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి

Mar 10 2026 1:28 PM | Updated on Mar 10 2026 1:28 PM

హుస్నాబాద్‌: స్వచ్ఛతలో అందరూ భాగస్వాములు కావాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి పొన్నం అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం హుస్నాబాద్‌లో 5 కె రన్‌ నిర్వహించారు. విద్యార్థులు, మహిళలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్‌కు పంపించాలన్నారు. దోమల బెడద నివారణకు ఖాళీ స్థలాల్లో నీరు నిలవకుండా చూడాలన్నారు. వేసవి కాలంలో తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement