కంప్యూటర్‌ విద్యతో ఉపాధి అవకాశాలు | - | Sakshi
Sakshi News home page

కంప్యూటర్‌ విద్యతో ఉపాధి అవకాశాలు

Mar 10 2026 1:28 PM | Updated on Mar 10 2026 1:28 PM

హుస్నాబాద్‌: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్‌ స్కిల్స్‌పై సర్టిఫికెట్‌ కోర్సు రెండో బ్యాచ్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ భిక్షపతి మాట్లాడుతూ ఆధునిక జీవన విధానంలో కంప్యూటర్‌ విద్య అనేది తప్పనిసరి అని తెలిపారు. ఏ కోర్సు అయినా రెండు నెలల పాటు శిక్షణ ఉంటుందని తెలిపారు. శిక్షణ అనంతరం విద్యార్థుల ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. ఈ సదవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కోర్సు కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ చంద్రమౌళి, అధ్యాపకులు తదితరులు ఉన్నారు.

మెగా మేళాలో పట్టు రైతులు

చిన్నకోడూరు(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన మెగా రైతు మేళాకు సోమవారం మండల పరిధిలోని చంద్లాపూర్‌ పట్టు రైతులు తరలివెళ్లారు. రైతు మేళాలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టు పరిశ్రమ శాఖ ఉమ్మడి మెదక్‌ జిల్లా డైరెక్టర్‌ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ పట్టు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహకాలు వివరించారు. పట్టు సాగులో తీసుకోవాల్సిన మెలకువలు వివరించారు. కార్యక్రమంలో అధికారులు ఐలయ్య, పట్టు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహులు, రైతులు ఉన్నారు.

నేడు మెగా ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌

గజ్వేల్‌రూరల్‌: విద్యార్థులకు ఉద్యోగావకాశాలను కల్పించేందుకు మంగళవారం మెగా ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు గజ్వేల్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ అనిత అబ్రహం పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్‌ హబ్‌లోగల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శోభారాణితో కలిసి ఆమె మాట్లాడారు. ప్రముఖ కంపెనీలు ఈ డ్రైవ్‌లో పాల్గొనున్నట్లు తెలిపారు. ఇంటర్‌, డిగ్రీ, పీజీతో పాటు ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న వారు అర్హులన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఉదయం 10గంటలకు కళాశాలలో జరిగే ప్లేస్మెంట్‌ డ్రైవ్‌కు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 8985710323 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

స్వచ్ఛ పట్టణంగా మార్చుదాం

మున్సిపల్‌ కమిషనర్‌ ఆశ్రిత్‌

సిద్దిపేటజోన్‌: సమష్టిగా పనిచేసి సిద్దిపేటను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుదామని మున్సిపల్‌ కమిషనర్‌ ఆశ్రిత్‌కుమార్‌ పిలుపునిచ్చారు. సోమవారం ప్రజా పాలన–ప్రగతి పాలన ప్రణాళికలో భాగంగా సోమవారం ఆయన పలు పార్కులు ప్రకృతి వనాలు సందర్శించారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఆశ్రిత్‌, అధికారులు, సిబ్బంది చీపురు పట్టి శుభ్రం చేశారు. ఎండిపోయిన పిచ్చి మొక్కలు, గడ్డి తొలగించారు. కాలనీ వాసులకు పలు సూచనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement