‘భోజనం’పై రాజీపడొద్దు | - | Sakshi
Sakshi News home page

‘భోజనం’పై రాజీపడొద్దు

Mar 10 2026 1:28 PM | Updated on Mar 10 2026 1:28 PM

మెనూ తప్పనిసరి మంత్రి పొన్నం ప్రభాకర్‌ బాలికల రెసిడెన్షియల్‌పాఠశాల ఆకస్మిక తనిఖీ

హుస్నాబాద్‌: ప్రభుత్వం రూపొందించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఆహారం విషయంలో రాజీ పడొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. హుస్నాబాద్‌లోని సోషల్‌ వెల్ఫేర్‌ బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాల(బెజ్జంకి)ను సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనంలో వడ్డిస్తున్న మెనూ పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయని, బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

ఆస్పత్రి నిర్మాణ పనుల పరిశీలన

హుస్నాబాద్‌లో కొత్తగా నిర్మిస్తున్న 250 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులను కలెక్టర్‌ హైమావతితో కలిసి మంత్రి పరిశీలించారు. జీ ప్లస్‌ 5 లో ఒక్కోఫ్లోర్‌ 30 వేల చదరపు అడుగులతో అధునాతన సాంకేతిక టెక్నాలజీతో ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పిల్లర్ల దశకు చేరుకున్న ఆస్పత్రి పనులు వచ్చే ఏడాది లోపు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచండి

హుస్నాబాద్‌రూరల్‌: బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచితే గ్రామాభివృద్ధికి కావాల్సిన నిధులు తెచ్చే బాధ్యత నాదేనని మంత్రి పొన్నం అన్నారు. సోమవారం మండల పరిషత్‌లో కలెక్టర్‌ హైమా వతి అధ్యక్షతన ప్రగతి ప్రణాళిక అంశాలపై సర్పంచ్‌లు, అధికారులతో చర్చించారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, గ్రామాలు అభివృద్ధి చేందాలంటే ముందుగా సర్పంచ్‌లు బడిలో పిల్లలను చేర్పించాలని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించడానికి గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తామన్నారు.

నాణ్యమైన ఆహారంఅందించాలి

Advertisement
 
Advertisement
Advertisement