ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తే చర్యలు
● నిబంధనలు అతిక్రమించి వ్యాపారం చేసేవారిపై చర్యలు తప్పవు ● ట్రాఫిక్ ఏసీపీ సుమన్‌కుమార్
గజ్వేల్‌రూరల్: ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఏసీపీ సుమన్‌కుమార్ అన్నారు. గజ్వేల్ పట్టణంలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన వాటిని ట్రాఫిక్ సీఐ మురళితో కలిసి మంగళవారం తొలగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏసీపీ సుమన్‌కుమార్ మాట్లాడుతూ వ్యాపారస్తులు ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు చేయవద్దని సూచించారు. రోడ్లపై సామగ్రి, బోర్డులను పెట్టి వాహనదారులకు ఇబ్బందులు కలిగించవద్దన్నారు. నిబంధనలు పాటించి తమ వ్యాపారాలను నిర్వహించుకోవాలన్నారు. అనంతరం పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో మద్యం తాగి వాహనాలు నడిపిన పలువురికి కౌన్సిలింగ్ ఇచ్చారు.


