శాసీ్త్రయ విధానంలో బోధించాలి
డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): బట్టి విధానంతో కాకుండా, శాసీ్త్రయ విధానంలో విద్యార్థులకు బోధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. టీ–శాట్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానగర్‌లో జిల్లా స్థాయి క్విజ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. క్విజ్‌లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానగర్ విద్యార్థిని సానియా, వక్తృత్వంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దమ్మగడ్డ విద్యార్థిని శ్వేత, వ్యాసరచన పోటీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దమ్మగడ్డ విద్యార్థిని సుహాసినిలు విజయం సాధించారు. ఈ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇలాంటి పోటీల్లో రాణించడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట అర్బన్ ఎంఈఓ ప్రభాకర్‌రెడ్డి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
మెనూ ప్రకారం ఆహారం అందించాలి
విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి నిర్వాహకులకు సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహిస్తున్న రూమ్ టు రీడ్ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నీలకంఠ మనోహర్, సెక్టోరియల్ అఽధికారి రంగనాథ్ పాల్గొన్నారు


