అందెశ్రీకి రేబర్తి గ్రామస్తుల నివాళి
మద్దూరు(హుస్నాబాద్): ప్రముఖ వాగ్గేయకారుడు అందెశ్రీ సొంత గ్రామమైన రేబర్తిలో ఆయనకు ఘన నివాళులర్పించారు. గ్రామ కూడలిలో అందెశ్రీ చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ రాష్ట్ర గీతం అందించిన ఘనత అందెశ్రీకి దక్కిందన్నారు. అందెశ్రీ మరణం మమ్మల్ని కలిచివేసిందంటూ ప్రగాడ సంతాపం తెలిపారు.
మల్లన్న హుండీ ఆదాయం రూ.73 లక్షలు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి వారి ఖజానాకు భారీ ఆదాయం సమకూరింది. 76రోజులలో హుండీ ద్వారా రూ.73,18,504 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి వెంకటేశ్ తెలిపారు. మంగళవారం స్వామి వారి ఆలయ ముఖ మండపంలో హుండీలలోని నగదును దేవాదాయ శాఖ సిద్దిపేట డివిజన్ ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది, శివరామకృష్ణ భజనమండలి సభ్యులు లెక్కించారు. నగదు రూ.73,18,504, విదేశీ కరెన్సీ 21, మిశ్రమ బంగారం 80 గ్రాములు, మిశ్రమ వెండి 4కిలోల 800 గ్రాములు ఉన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తలు లింగంపల్లి శ్రీనివాస్, కాయిత మోహన్‌రెడ్డి, మామిడాల లక్ష్మి, ఆలయ ఏఈఓ శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు పాల్గొన్నారు.
ఓంకారం.. దివ్వెల శోభితం
వర్గల్(గజ్వేల్): ప్రసిద్ధమైన నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రం నిత్య సామూహిక కార్తీక దీపోత్సవంతో అలరారుతోంది. మంగళవారం రాత్రి స్వామివారి సన్నిధిలో సామూహిక దీపోత్సవం నేత్రపర్వం చేసింది. భక్తజనులు ‘ఓం’ ఆకృతిలో దివ్వెలు వెలిగించి సామూహిక దీపారాధనలో భాగస్వాములయ్యారు. స్వామివారి ఆశీస్సులు పొందారు.
విద్యా రంగానికి
ఆజాద్ సేవలు ఎనలేనివి
సిద్దిపేటఎడ్యుకేషన్: దేశంలో విద్యారంగ పటిష్టతకు, సీ్త్రవిద్యకు భారత తొలి విద్యాశాఖ మంత్రి డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ పటిష్టమైన పునాదులు వేశారని వక్తలు కొనియాడారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్, జూనియర్ కళాశాల(కోఎడ్యుకేషన్)లో ఆజాద్ జయంతిని పురస్కరించుకుని పరిశోధన, అభివృద్ధి విభాగం కన్వీనర్ డాక్టర్ గోపాల సుదర్శనం అధ్యక్షతన మంగళవారం జాతీయ విద్యాదినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, డాక్టర్ ఖలీంమొయియొద్దిన్, సీఓఈ డాక్టర్ గోపాలసుదర్శనం, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి తదితరులు విద్యారంగానికి కలాం చేసిన సేవలను కొనియాడారు. భారతీయ విద్యావిదానం ప్రపంచానికి ఒక ప్రమాణిక ఆధారమన్నారు. ఐఐటీ, యూజీసీ, ఏఐసీటీఈ, ఐఐఎస్ లాంటి ప్రఖ్యాత విద్యాసంస్థల ఏర్పాటుకు అబుల్ కలాం కృషి ఎంతో ఉందన్నారు. కారుకలన్నారు. సుధీర్ఘ కాలం విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన సాంస్కృతికి మండలలను ఏర్పాటు చేసి విద్యా విశిష్టతను దేశానికి చాటిచెప్పిన మహనీయుడన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.
అందెశ్రీకి రేబర్తి గ్రామస్తుల నివాళి
అందెశ్రీకి రేబర్తి గ్రామస్తుల నివాళి


