
స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి
మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్
హుస్నాబాద్: బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ అన్నారు. బుధవారం వంద రోజుల ప్రణాళికలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులు, వృత్తులు, అమ్మకాల ప్రదర్శనను కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మల్లికార్జున్ మాట్లాడుతూ మహిళా సంఘాలు ఇందిరా మహిళా శక్తి, బ్యాంక్ లింకేజీ, సీ్త్రనిధి తదితర లోన్ల ద్వారా స్వయం ఉపాధి కోసం రుణాలు పొందారన్నారు. ఈ ఏడాది పట్టణంలో 503 సంఘాలకు గాను 23 సంఘాలకు రూ.2 కోట్లు రుణాలు ఇచ్చామన్నారు. ఈ ప్రదర్శనలో తినుబండారాలు, స్వీట్లు, కప్స్, ప్లేట్స్, కూరగాయ లు, గాజులు, డ్రెస్ మెటీరియల్ ఐటమ్స్, తదితర ఉత్పత్తులను ప్రదర్శించారన్నారు. రుణాలను వ్యక్తిగత అవసరాలకు కాకుండా వ్యాపారాలకు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఎంసీ సంతోషిమాత, మున్సిపల్ మేనేజర్ సంపత్, ఆర్పీలు పాల్గొన్నారు.