విద్యాధరి సేవలో నూతన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యాధరి సేవలో నూతన కలెక్టర్‌

Jun 16 2025 7:17 AM | Updated on Jun 16 2025 7:17 AM

విద్య

విద్యాధరి సేవలో నూతన కలెక్టర్‌

వర్గల్‌(గజ్వేల్‌): సుప్రసిద్ధమైన వర్గల్‌ విద్యాసరస్వతి క్షేత్రాన్ని ఆదివారం సాయంత్రం నూతన కలెక్టర్‌ హైమవతి సందర్శించారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్‌ చంద్రశేఖర సిద్ధాంతి పరివారం ఆమెకు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. కలెక్టర్‌ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఆలయ అర్చక వేదపండితులు వేదాశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. చంద్రశేఖర సిద్దాంతి ఆలయం తరపున అమ్మవారి జ్ఞాపికను అందజేసి సన్మానించారు. అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందడం సంతోషంగా ఉందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మంత్రిని కలిసిన కలెక్టర్‌

హుస్నాబాద్‌: కలెక్టర్‌ హైమావతి ఆదివారం హుస్నాబాద్‌ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఆలయవర్గాల సాదర స్వాగతం

జ్ఞాపిక అందజేత

విద్యాధరి సేవలో నూతన కలెక్టర్‌1
1/1

విద్యాధరి సేవలో నూతన కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement