తాగొచ్చి వేధిస్తున్నాడని.. | - | Sakshi
Sakshi News home page

తాగొచ్చి వేధిస్తున్నాడని..

Nov 24 2026 11:18 AM | Updated on Nov 24 2026 11:18 AM

కంగ్టి(నారాయణఖేడ్‌): అనుమానాస్పద మృతి కేసులో మృతుని భార్యే హంతకురాలని పోలీసులు గుర్తించి ఆమెను అరెస్టు చేశారు. సోమవారం సీఐ వెంకట్‌రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 10న మండలంలోని దెగుల్వాడిలో గూనె జరప్ప పడుకున్న చోటే అగ్నికి ఆహుతై మృతి చెందాడు. ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి ఎట్టకేలకు ఛేదించారు. మృతుడు జరప్ప ప్రతీ రోజూ మద్యం తాగి ఇంటికొచ్చి భార్య బుజ్జమ్మపై అనుమానంతో గొడవ పడుతూ హింసించేవాడు. ఈ క్రమంలో ఎలాగైనా భర్త పీడ వదిలించుకోవాలని భార్య నిర్ణయించుకుంది. కాగా బైక్‌లో పోయడానికి ఇంట్లో తెచ్చి పెట్టిన పెట్రోల్‌ను అర్ధరాత్రి ఆరుబయట పడుకున్న భర్తపై పోసి నిప్పటించినట్లు విచారణలో నేరం అంగీకరించింది. మృతునికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. నిందితురాలు బుజ్జమ్మను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ దుర్గారెడ్డి ఆధ్వర్యంలో కేసు విచారణ చేసిన పోలీసు బృందాన్ని సీఐ అభినందించారు.

● భర్తపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్య

● భార్య అరెస్ట్‌

● కేసు వివరాలు వెల్లడించిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement