న్యాల్కల్(జహీరాబాద్): మండల పరిధిలోని గణేశ్‌పూర్ గ్రామ శివారులో అక్రమంగా కొనసాగుతున్న ఎర్రరాయి తవ్వకాలపై పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మూడవ రోజు సోమవారం జహీరాబాద్ డీఎస్పీ సైదానాయక్ ఆధ్వర్యంలో జహీరాబాద్ రూరల్ సీఐ నర్సింహులు, హద్నూర్, ఝరాసంగం, రాయికోడ్ ఎస్ఐలు సుజిత్, క్రాంతి పటేల్, చైతన్య కిరణ్, సిబ్బంది డ్రోన్ల సహాయంతో మెరుపు దాడులు నిర్వహించారు. ఎర్రరాయి తవ్వకాలు నిర్వహిస్తున్న ప్రదేశాలను పోలీసులు జల్లెడ పట్టారు. దాడులు వరుసగా కొనసాగుతుండడంతో నిర్వాహకులు పరారయ్యారు. అక్కడ దొరిన మూడు రాయి కోత మెషీన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మూడు కోత మెషీన్లు స్వాధీనం


