అంకితభావంతో విధులు నిర్వర్తించాలి | - | Sakshi
Sakshi News home page

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

Nov 24 2026 11:18 AM | Updated on Nov 24 2026 11:18 AM

సిద్దిపేటకమాన్‌: ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వర్తించి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని సీపీ రష్మీ పెరుమాళ్‌ సూచించారు. 46 వారాల జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో భాగంగా ముగ్గురు ప్రొబేషనరీ డీఎస్పీలు సుమ, భరత్‌రెడ్డి, ముషరఫ్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో సీపీకి సోమవారం రిపోర్ట్‌ చేశారు. ఈ సందర్భంగా వారితో సీపీ సమావేశం నిర్వహించారు. జిల్లా పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, పోలీసు స్టేషన్ల పనితీరు, క్షేత్రస్థాయి శిక్షణలో నేర్చుకోవాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు.

సీపీ రష్మీ పెరుమాళ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement