నేడు ప్రత్యేక ఓటరు నమోదు శిబిరం | - | Sakshi
Sakshi News home page

నేడు ప్రత్యేక ఓటరు నమోదు శిబిరం

Oct 15 2026 11:53 AM | Updated on Oct 15 2026 11:53 AM

నేడు ప్రత్యేక ఓటరు నమోదు శిబిరం రేపు జాబ్‌ మేళా పెండింగ్‌ పారితోషికం చెల్లించాలి ఐఎన్‌టీయూసీ జాతీయ కార్యదర్శిగా లలిత టీఎన్‌జీవో అధ్యక్షుడిగా యాదవరెడ్డి వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దు

నారాయణఖేడ్‌: ఇప్పటివరకు జాబితాలో పేరు నమోదుకాని, 18 ఏళ్లు నిండిన అర్హులైన యువతీ యువకులు, అర్హులైన పట్టణవాసుల కోసం ఖేడ్‌ మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో గురువారం ప్రత్యేక ఓటరు నమోదు శిబిరం నిర్వహించనున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ ప్రశాంతి తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

సంగారెడ్డి టౌన్‌: జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 16న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి శాఖ అధికారి రవికిరణ్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అపోలో ఫార్మసీలో ఉద్యోగాలున్నాయని పదవతరగతి, ఇంటర్‌, డిగ్రీ, ఫార్మసీలో పాసైన అభ్యర్థులు సంగారెడ్డిలోని జిల్లా కార్యాలయంలో ఇంటర్వ్యూలకు పూర్తి సర్టిఫికెట్లతో హాజరు కావాలని పేర్కొన్నారు.

నారాయణఖేడ్‌: బూత్‌స్థాయి అధికారులు (బీఎల్వోలు) చేసిన పనులకు సంబంధించి పెండింగ్‌ పారితోషికం వెంటనే చెల్లించాలని సెంటర్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్‌ కో ఆర్డినేషన్‌ సెంటర్‌ (టీయూసీసీ) జిల్లా నాయకులు చిరంజీవి డిమాండ్‌ చేశారు. బుధవారం ఖేడ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..భత్యాన్ని సకాలంలో చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో వెంటనే చెల్లించాలని కోరారు.

జహీరాబాద్‌ టౌన్‌: ఇండియన్‌ నేషనల్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌(ఐఎన్‌టీయూసీ)జాతీయ కార్యదర్శిగా జహీరాబాద్‌కు చెందిన ఆడప లలిత నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం జరిగిన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్‌ణ్ణ్ణమూర్తి నియామక పత్రాన్ని అందజేశారు.

సంగారెడ్డి: టీఎన్‌జీవోస్‌ సంగారెడ్డి పట్టణ సంఘం నూతన అధ్యక్షుడిగా యాదవరెడ్డి, కార్యదర్శిగా వెంకటేశ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జేఏసీ చైర్మన్‌ మహమ్మద్‌ జావిద్‌ అలీ, టీఎన్జీవోస్‌ కార్యదర్శి వేల్పూరు రవి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ఎన్నికల కార్యక్రమానికి అసోసియేట్‌ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అసోసియేట్‌ అధ్యక్షుడిగా రమేశ్‌, కోశాధికారిగా హైమద్‌ ఖాన్‌ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా రాజు, సుజాత, నాగమణి, ప్రదీప్‌, సంయుక్త కార్యదర్శులుగా గోపాల్‌, పర్వీన్‌ బేగం, అజాం, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా శ్రావణి ఎన్నికయ్యారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య

సంగారెడ్డి టౌన్‌: విద్యహక్కుచట్టంపై బాలికలు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. సంగారెడ్డిలోని బాలసదన్‌లో బుధవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవ వే డుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ..బాలికలు వ్యక్తిగత భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సోషల్‌ మీడియాలో వ్యక్తిగత విషయాలు ఇతరుల తో పంచుకోవద్దని స్పష్టం చేశారు. లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో వాటిని సాధించాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement