మెరుగైన సేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన సేవలందించాలి

Oct 15 2026 11:53 AM | Updated on Oct 15 2026 11:53 AM

సంగారెడ్డి జోన్‌: సహకార బ్యాంకుల ద్వారా రైతులకు, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ అధికారులకు సూచించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌ కార్యాలయంలో కలెక్టర్‌, బ్యాంకు పర్సన్‌ ఇన్‌చార్జి అధ్యక్షతన బుధవారం జిల్లాస్థాయి మానిటరింగ్‌ అండ్‌ రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 54 అంశాలకు కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..రైతులకు అవసరమైన రుణాలను సకాలంలో మంజూరు చేయడంతోపాటు, రుణాల వసూళ్లు, డిపాజిట్ల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అర్హులైన రైతులకు నిబంధనల ప్రకారం పంట రుణాలు, ఇతర రుణ సదుపాయాలను సకాలంలో అందించాలని తెలిపారు. మంజూరు చేసిన రుణాల వసూళ్లను వేగవంతం చేసి, నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకులో డిపాజిట్లను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, రైతులు, ఖాతాదారులకు బ్యాంకింగ్‌ సేవలను సులభతరంగా, పారదర్శకంగా అందించాలని సూచించారు. రికవరీ శాతం తక్కువగా ఉన్న రామాయంపేట, సంగారెడ్డి లోకల్‌ బ్రాంచ్‌, ఝరాసంగం, శంకరంపేట–ఆర్‌, సిద్దిపేట–2 శాఖల అధికారులకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయాలని సూచించారు. సమావేశంలో డీసీసీబీ బ్యాంకు సీఈఓ ఎం.సురేశ్‌, నాబార్డ్‌ డీడీఎం ఎం.వి. కృష్ణ తేజ, జనరల్‌ మేనేజర్లు కె.జనార్ధన్‌, జి.శ్రీనివాస్‌, డీజీఎంలు కె.చంద్రశేఖర్‌రెడ్డి, ఎం.రమేశ్‌, ఏజీఎంలు జి.యాదగిరి, జి.శ్రీనివాస్‌, కె.వెంకటేశం, ఎల్‌.సంగమేశ్వర్‌, ఎ.కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టులు ఆరోగ్య పరిరక్షించుకోవాలి

సంగారెడ్డి : పాత్రికేయులు తమ ఆరోగ్య పరిరక్షణకు తగిన ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో పాత్రికేయులు కీలకపాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. సన్‌రైజ్‌ ఆస్పత్రి సహకారంతో, తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల జిల్లా సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ...ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పాత్రికేయుల సేవలు అభినందనీయమన్నారు. ఈ వైద్య శిబిరంలో అవసరమైన వారికి ఈసీజీ, 2డీ ఎకో, రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సన్‌రైజ్‌ ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ స్వామి గౌడ్‌, జర్నలిస్టు సంఘాల నాయకులు, పాత్రికేయులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement