పాత పెన్షన్‌ అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పాత పెన్షన్‌ అమలు చేయాలి

Oct 15 2026 11:53 AM | Updated on Oct 15 2026 11:53 AM

పాత పెన్షన్‌ అమలు చేయాలి ప్రమాదాల నివారణకు కృషి చేయాలి

జహీరాబాద్‌ టౌన్‌: పాత పెన్షన్‌ అమలు చేయాలని ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ కార్పొరేషన్‌ యూనియన్‌ నాయకులు బుధవారం స్థానిక ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ...న్యాయపరంగా 1996 బ్యాచ్‌ ఉద్యోగులకు పాత పెన్షన్‌ వర్తింపజేయాలన్నారు. పాత పెన్షన్‌ పొందేవరకు ఐక్య పోరాటాలు చేయాలని, యూనియన్‌ తరఫున పూర్తి సంఘీభావం ఉంటుందన్నారు.

ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌

సంగారెడ్డి జోన్‌: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌ పేర్కొన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంంలో పోలీసు అధికారులతో నేరాలపై నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..ప్రతీ కేసును నాణ్యమైన దర్యాప్తుతో త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రత్యేక ప్రణాళికతో పెండింగ్‌, మిస్సింగ్‌ కేసులను చేధించాలన్నారు. కేసుల దర్యాప్తులో సాంకేతిక, న్యాయపరమైన సందేహాలు తలెత్తినప్పుడు ఇన్వెస్టిగేషన్‌ సపోర్ట్‌ సెంటర్‌ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అధికంగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలను హాట్‌స్పాట్లుగా గుర్తించి, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయించాలని సూచించారు. మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టడంతోపాటు మహిళా చట్టాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఎస్‌హెచ్‌ఓలకు కేటాయించిన పోలీసు వాహనాల స్థితిగతులను పరిశీలించారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందిని అభినందించి, నగదు రివార్డులు, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీలు సత్తయ్యగౌడ్‌, వెంకట్‌రెడ్డి, సైదా నాయక్‌, వర్టికల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, డీఎస్పీ సురేందర్‌రెడ్డి, ఏఆర్‌ డీఎస్పీ నరేందర్‌, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్‌ సదా నాగరాజు, జిల్లా ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement