నారాయణఖేడ్: మానవ హక్కులపై ప్రతీ ఒక్కరికి అవగాహన తప్పనిసరని నేషనల్ హ్యూమన్రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ అబ్దుల్ రహీం పేర్కొన్నారు. ఖేడ్ అంబేడ్కర్ భవన్లో బుధవారం నిర్వహించిన సంఘం డివిజన్ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ..హక్కుల పరిరక్షణలో అందరి భాగస్వామ్యం అవసరమన్నారు. సమగ్రంగా అవగాహన కల్పించేందుకు డిసెంబరు 8న ఖేడ్లో మానవ హక్కుల పరిరక్షణపై డివిజన్ స్థాయి అవగాహన సదస్సు, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎన్హెచ్ఆర్సీ, సీజేసీ రాష్ట్ర చైర్మన్ అబ్దుల్ రహీం


