సంగారెడ్డి జోన్: పూలతో జరుపుకునే అరుదైన పండుగ బతుకమ్మ వేడుకలు కలెక్టరేట్లో ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సంబురాలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ప్రతీక్జైన్, అదనపు కలెక్టర్ సంగీత పాల్గొని బతుకమ్మ పూజా కార్యక్రమాలు నిర్వహించి బతుకమ్మ ఆడారు. అక్టోబర్ 17వరకు ప్రతీరోజు సాయంత్రం 4 గంటల నుంచి బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలు, యువత, మహిళా ఉద్యోగులు, మహిళలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు జగదీశ్, ఐనేష్ తదితరులు పాల్గొన్నారు.


