వ్యాసరచనలో విద్యార్థి ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

వ్యాసరచనలో విద్యార్థి ప్రతిభ

Mar 10 2026 1:29 PM | Updated on Mar 10 2026 1:29 PM

వ్యాసరచనలో విద్యార్థి ప్రతిభ మిషన్‌ భగీరథ నీరు లీకేజీ అంబులెన్స్‌ తనిఖీ ప్రగతి ప్రణాళిక పనులపై ఆరా

చేగుంట(తూప్రాన్‌): లయన్స్‌ క్లబ్‌ నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో కృష్ణవేణి పాఠశాల విద్యార్థిని హాశ్విక మొదటి బహుమతి గెలుచుకున్నట్లు ప్రిన్సిపాల్‌ రేణుక తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లయన్స్‌ డీ320 ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై వ్యాసరచన పోటీలు నిర్వహించగా విద్యార్థిని ప్రతిభ చాటింది. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో లయన్స్‌ ప్రతినిధులు బాబూరావు, అమర్‌నాథ్‌రావు, గాయత్రి విద్యార్థినికి ప్రశంసాపత్రం, మెమెంటో అందజేశారు.

నర్సాపూర్‌: నర్సాపూర్‌ – సంగారెడ్డి మార్గంలో పట్టణ శివారులోని రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద భగీరథ పథకం పైపులైను ఎయిర్‌ వాల్వ్‌కు సోమవారం లీకేజీ ఏర్పడింది. దీంతో నీరంతా కొంత సేపు వృథాగా పోయాయి. ఈ విషయమై మిషన్‌ భగీరథ పథకం డీఈఈ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ తమకు సమాచారం రాగానే స్పందించి నీటి సరఫరా నిలిపి వేసి వాల్వ్‌కు మరమ్మతులు చేయించామని చెప్పారు. మరమ్మతుల అనంతరం నీటి సరఫరాను పునరుద్ధరించామని ఆయన తెలిపారు.

అక్కన్నపేట(హుస్నాబాద్‌): మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన 108 అంబులెన్స్‌ వాహనాన్ని సోమవారం ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ సంపత్‌కుమార్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అత్యవసర సమయంలో వినియోగించే పరికరాల పనితీరును, సంబంధించిన రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. రోడ్డు ప్రమాదాలు, పాముకాటు వంటి అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌ను మండల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పైలట్‌ రవితేజ, ఈఎంటీ శోభన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెల్లాపూర్‌లో కమిషనర్‌ పర్యటన

రామచంద్రాపురం(పటాన్‌చెరు): పటాన్‌చెరు సర్కిల్‌ పరిధిలోని తెల్లాపూర్‌ డివిజన్‌ను సోమవారం సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సృజన సందర్శించారు. గోపన్‌పల్లి నుంచి తెల్లాపూర్‌ వరకు నడుస్తున్న రోడ్డు సర్వే పనులను ఆమె పరిశీలించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా డివిజన్‌లో జరుగుతున్న కార్యక్రమాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్‌ జ్యోతి రెడ్డి, డీఈ కృష్ణవేణి, ఏఈ ఫైజాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement