ఇంటి నుంచి వెళ్లిపోయిన భర్త
పటాన్‌చెరు టౌన్: వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ఇస్నాపూర్ మున్సిపల్‌కు చెందిన నాగేశ్ ఏ పని చేయకుండా తాగి ఇంటికి వస్తుండటంతో భార్య సుజ మందలించింది. దీంతో భార్యకు చెప్పకుండా ఈనెల 6న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దీంతో భర్త కోసం తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త అదృశ్యంపై భార్య సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.


