నూతన విద్యా విధానం అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

నూతన విద్యా విధానం అమలు చేయాలి

Mar 10 2026 1:29 PM | Updated on Mar 10 2026 1:29 PM

తపస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

మెదక్‌జోన్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాన్ని అమలు చేయాలని తపస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన మెదక్‌కు వచ్చిన సందర్భంగా కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్‌ నివేదిక అశాసీ్త్రయమైనదని, ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలన్నీ ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. క్షేత్రస్థాయిలో విద్యా విధానం ఎలా ఉందో అవగాహన లేని వ్యక్తులతో విద్యా కమిషన్‌ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని రాష్ట్రంలో యథావిధిగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తపస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్ధు, ఉపాధ్యక్షులు శ్రీధర్‌ రెడ్డి, మాధవరెడ్డి, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement