కేజీబీవీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు సుహాసిని
నర్సాపూర్ రూరల్: కేజీబీవీ, యూఆర్‌ఎస్ ఉద్యో గుల సమస్యలు పరిష్కరించాలని కేజీబీవీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు సుహాసిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని చిప్పల్‌తుర్తి కేజీబీవీ వద్ద టీఎస్ యూటీఎఫ్, కేజీబీవీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుహాసిని, టీఎస్ యూటీఎఫ్ మండల ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడారు. కేజీబీవీ, యుఆర్‌ఎస్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయ, ఉద్యోగుల న్యాయమైన కోరికలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వారికి వెంటనే సమాన పనికి సమాన వేతనం వర్తింపజేయాలన్నారు. సర్వీస్ రక్షణ కల్పిస్తూ, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉద్యోగులు శ్రీలత, జబీనా సుల్తానా, పుణ్యవతి, షమీం, ఇందిరా, జ్యోతి, మంజుల, స్వరూప, శృతి పాల్గొన్నారు.


