సోషల్‌ మీడియా మోసాలపై అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా మోసాలపై అప్రమత్తం

Mar 10 2026 1:29 PM | Updated on Mar 10 2026 1:29 PM

సైబర్‌ క్రైం డీఎస్పీ సుభాష్‌ చంద్రబోస్‌

మెదక్‌జోన్‌: సోషల్‌ మీడియాలో కొనసాగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైం డీఎస్పీ సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. అంతర్జా తీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళా శాలలో సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నకిలీ ప్రొఫైల్స్‌ ద్వారా జరిగే మోసాలు, తదితర వాటి గురించి అవగాహన కల్పించారు. సైబర్‌ నేరాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ చేయాలన్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సైబర్‌ క్రైం సిబ్బంది సతీశ్‌, సయ్యద్‌, స్వప్న, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement