వివరాలు వెల్లడించిన గజ్వేల్ ఏసీపీ
గజ్వేల్‌రూరల్: ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం గజ్వేల్ ఏసీపీ నరసింహులు స్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని బాలాజీ ఎన్‌క్లేవ్‌కు చెందిన ప్రవీణ్ తన ఇంటిముందు ఉంచిన బైక్ చోరీకి గురైనట్లు ఈనెల 2న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు పట్టణంలోని పిడిచెడ్ రోడ్డు నుంచి ప్రభుత్వాస్పత్రి వైపు అనుమానాస్పదంగా పల్సర్ బైక్‌పై వస్తున్న వ్యక్తులను తనిఖీ చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తి పారిపోగా, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వర్గల్ మండలం మైలారం గ్రామానికి చెందిన బూర్గుపల్లి స్వామి, బూర్గుపల్లి మల్లేశ్‌లుగా గుర్తించారు. వారి వద్ద నుంచి వివిధ ప్రాంతాల్లో అపహరించిన 7 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పలు స్టేషన్ల పరిధిలో బైక్ చోరీ కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. కేసును చేధించిన గజ్వేల్ ఎస్‌హెచ్‌వో రవి, అదనపు ఇన్‌స్పెక్టర్ ముత్యంరాజు, ఎస్‌ఐ ప్రేమ్‌దీప్, క్రైమ్ సిబ్బంది వెంకటేశ్, రవి, దివ్య, స్వామి, వెంకన్నను ఏసీపీ అభినందించారు.


