పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Mar 10 2026 1:29 PM | Updated on Mar 10 2026 1:29 PM

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి సీసీరోడ్లకు నిధులు మంజూరు

జిల్లా రవాణా శాఖాధికారి

మెదక్‌జోన్‌: పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని, ఇది అందరి బాధ్యతని జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటస్వామి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా సిబ్బందితో కలిసి పిచ్చిమొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ 99 రోజుల ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.

చిన్నశంకరంపేట(మెదక్‌): నార్సింగి మండలంలోని నాలుగు గ్రామాలకు రూ.45 లక్షల నిధులు సీసీ రోడ్లకు మంజూరైనట్లు కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. నార్సింగికి రూ. 25 లక్షలు, నర్సంపల్లి, వల్లూర్‌ గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. నిధుల మంజూరుకు సహకరించిన ఇన్‌చార్జి మంత్రి వివేక్‌, దుబ్బాక నియోజవర్గ ఇన్‌చార్జి శ్రీనివాస్‌రెడ్డికి కాంగ్రెస్‌ మండల నాయకులు రాజేందర్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, రాజేశ్‌, బాల్‌రాజ్‌గౌడ్‌, వినోద్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement