
ఇంట్లో గొడవపడి వెళ్లిన మహిళ..
సంగారెడ్డి క్రైమ్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ అదృశ్యమైంది.ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేశ్ వివరాల ప్రకారం... ములుగు జిల్లా మంగంపేట గ్రామానికి చెందిన నీలం వీరమ్మ (55) తన కుటుంబంతో సంగారెడ్డి పట్టణానికి వచ్చి మంజీరనగర్ కాలనీలో స్థిరపడ్డారు. వృత్తిరీత్య పట్టణంలో పద్మశాలి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరమ్మ గత నెల 30న మధ్యాహ్నం ఇంట్లో కోడలుతో గొడవ పడి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుప్రక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు.
పటాన్‌చెరులో వ్యక్తి..
పటాన్‌చెరు టౌన్: పనిపై బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం... పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని కుమ్మరి బస్తీకి చెందిన శాబుద్దీన్ బేకరీలో వర్కర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆగస్టు 29న పని ఉందని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. స్థానికంగా వెతికినా ఆయన ఆచూకీ లభించలేదు.