
మహిళా సాధికారతే లక్ష్యం
కోవ్ అధ్యక్షురాలు కల్పనారావు
రామచంద్రపురం (పటాన్‌చెరు): మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి కోవ్ (తెలంగాణ రాష్ట్ర మహిళా పారిశ్రామిక వేత్తల సమాఖ్య) ప్రధాన లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షురాలు కల్పనారావు స్పష్టం చేశారు. శనివారం తెల్లాపూర్ పట్టణ పరిధిలోని రాజా పుష్ప గ్రీండేల్ కమ్యూనిటీలో కోవ్ మార్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, మహిళలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు, విక్రయించేందుకు ఈ వేదిక ఏర్పాటు చేశామన్నారు. ఈ మార్ట్‌లో 30కి పైగా మైక్రో మహిళా వ్యాపారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. కార్యక్రమంలో కోవ్ కార్యదర్శి అనురాధ కరాటి, కోశాధికారి కీర్తి చీకోటి, సంయుక్త కార్యదర్శి నిషా అగర్వాల్, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నీరజ గోదావరి తదితరులు పాల్గొన్నారు.