
పీసీసీ అధ్యక్షుడికి మతి భ్రమించింది
సంగారెడ్డి: పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మండిపడ్డారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..అజ్ఞానంతో రేవంత్‌రెడ్డితో పోటీ పడటం అవివేకమన్నారు. బీఆర్‌ఎస్ చేసిన పనులు ప్రస్తుతం కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయని గ్రామాల్లోకి వెళ్త్తే ప్రజలే చెబుతారని వ్యాఖ్యానించారు. హరీశ్‌రావుపై మాట్లాడేటప్పుడు ఆయన చేసిన అభివృద్ధిని చూసి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్