
ఆరుతడి పంటల సాగుతో లాభాలు
నర్సాపూర్ రూరల్: ఆరుతడి పంటల సాగుతో మంచి లాభాలు వస్తాయని తునికి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఉదయ్, మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు రైతులకు సూచించారు. శుక్రవారం అగ్రికల్చర్ విద్యార్థులు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మూసాపేటలో రైతులకు ఆరుతడి పంటల సాగు, బిందు సేద్యం, డ్రిప్ ఇరిగేషన్ ప్రయోజనాలను వివరించారు. దీంతోపాటు పంటల సంరక్షణ పాస్పరస్ సెల్యూబ్లిజిగ్ బ్యాక్టీరియా(పీఎస్‌బీ) గూర్చి వివరించారు. విత్తన శుద్ధి, భూసార పరీక్షల వంటి వాటి గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.