
హోటళ్లలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి
దుబ్బాక: హోటళ్లలో నాణ్యతలేని ఆహారపదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఫుడ్‌సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ జయరాం హెచ్చరించారు. దుబ్బాక పట్టణంలోని ఉడిపి శ్రీకృష్ణ హోటల్‌లో టిఫిన్ చేస్తుండగా సాంబార్‌లో పురుగులు రావడంతో గురువారం బాధితులు వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురైన విషయం విధితమే. ఈ విషయం తెలుసుకున్న ఫుడ్‌సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ జయరాం శుక్రవారం ఉడిపి హోటల్‌ను తనిఖీ చేశారు. అక్కడ వాడుతున్న ఆయిల్, పప్పు దినుసులు, కారంపొడి శాంపిల్స్‌ను సేకరించారు. అలాగే ప్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను తొలగించారు. ఈ సందర్భంగా హోటల్ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సేకరించిన శాంపిల్స్ పరీక్షల ఫలితం వచ్చాక తగు చర్యలు తీసుకుంటామన్నారు. హోటళ్లలో నాణ్యతలేని ఆహారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వవద్దని సూచించారు.
రూ.5 వేల జరిమానా..
ఉడిపి హోటల్‌లో వంటగదితో పాటు పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా ఉండటంతో మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఆస రాజశేఖర్ యజమానికి రూ.5 వేల జరిమానా విధించారు.
జిల్లా ఫుడ్ సేప్టీ ఇన్‌స్పెక్టర్ జయరాం
ఉడిపి శ్రీకృష్ణ హోటల్‌కు
రూ.5 వేలు జరిమానా