
బలవంతపు భూసేకరణ వద్దు
కొండాపూర్(సంగారెడ్డి): పరిశ్రమల ఏర్పాటు పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూ సేకరణ చేయవద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం పేర్కొన్నారు. శుక్రవారం సీపీఎం నాయకులు మండల పరిధిలోని మాందాపూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ... గ్రామంలో గల సర్వే నం.22లో సుమారు 300 ఎకరాల భూమిని దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకుంటున్నారు. అలాంటి రైతుల భూమిని ప్రభుత్వం బడా కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందని, ఒక వేళ భూములు ఇవ్వాల్సి వస్తే 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమి కోల్పోయిన రైతుల ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చి, వారి ఒప్పందంతో భూములు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో వృద్ద్ధాప్య, వితంతు పెన్షన్‌లు రూ.4016, వికలాంగుల పెన్షన్ రూ.6016 ఇస్తామని వాగ్దానాలు చేశారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి రాజయ్య మండల కమిటీ సభ్యులు బాబురావు, శాఖ కార్యదర్శి సుధాకర్, అమృతమ్మ, రమేశ్, సంజీవులు, మాజీ సర్పంచ్ శ్రీశైలం, విక్రం, రైతులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం