
బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలి
సిద్దిపేటఅర్బన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు డిమాండ్ చేశారు. ఆ తరువాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని కార్మిక, కర్షక భవన్‌లో సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల పరిపాలన స్తంభించిపోయిందని, సమస్యలు పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దేశంలో అమెరికన్ సామ్రాజ్యవాదానికి తలుపులు బార్లా తెరిచారని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 25 శాతం టారిఫ్‌ను పెంచి దేశంపై సుంకాలు విధిస్తుంటే ప్రధాని నోరు మెదపడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు అసహానానికి గురికాకముందే ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు గోపాలస్వామి, శశిధర్, ఎల్లయ్య, సత్తిరెడ్డి, భాస్కర్, జిల్లా కమిటీ సభ్యులు వెంకట్, యాదగిరి, అరుణ్‌కుమార్, బాలనర్సయ్య, శ్రీనివాస్, నవీన, శారద, కృష్ణారెడ్డి, శిరీష, ప్రశాంత్ పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు
చుక్క రాములు