
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
జహీరాబాద్ టౌన్: మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మొగుడంపల్లి మండలం పర్వతాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ.రాజేందర్‌రెడ్డి కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఇజ్రాయిల్(42) సెంట్రింగ్ కూలీ పనులకు వెళ్తూ మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. మూడు రోజుల క్రితం భార్యతో గొడవపడి ఇంటికి నిప్పంటించాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
బాలిక అదృశ్యం
కల్హేర్(నారాయణఖేడ్): ఇంటి నుంచి వెళ్లిన బాలిక అదృశ్యమైంది. కల్హేర్ ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి వివరాల ప్రకారం... కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం బ్రహ్మణపల్లికి చెందిన దుర్గ భవాని కల్హేర్‌లోని మేనమామ రమేశ్ వద్ద ఉంటోంది. గురువారం సాయంత్రం ఇంటి నంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు వెతికినా ఆచూకీ లభించలేదు. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.