
మట్టి రవాణాకు పాల్పడితే క్రిమినల్ కేసులు
జిన్నారం (పటాన్‌చెరు): అక్రమ మట్టి రవాణాపై పలు పత్రికల్లో వచ్చిన కథనాలకు రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. రాళ్లకత్వ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 286లో కొంతకాలంగా అక్రమార్కులు ప్రభుత్వ భూముల నుంచి మట్టి రవాణాకు పాల్పడుతున్నారు. తహసిల్దార్ దేవదాస్, ఎస్‌ఐ నాగలక్ష్మి శనివారం మట్టి రవాణా చేస్తున్న భూములను పరిశీంలించారు. అనంతరం గ్రామస్తులను కలిసి మట్టి రవాణపై ఆరా తీశారు. ప్రభుత్వం నిరుపేద రైతులు వ్యవసాయం చేసేందుకు అసైన్డ్ భూములను ఇచ్చిందన్నారు. అలా కాకుండా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. ఇప్పటికై నా అక్రమ మట్టి రవాణాను ఆపాలని లేకపోతే ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.

మట్టి రవాణాకు పాల్పడితే క్రిమినల్ కేసులు