
ఎల్వోసీ అందజేత
నారాయణఖేడ్: కల్హేర్ మండలం మాసానిపల్లికి చెందిన పొన్నం యాదగిరికి అత్యవసర వైద్యం కోసం సీఎం సహాయనిధి నుంచి రూ.2.50 లక్షల మంజూరుకు సంబంధించి ఎల్వోసీ ఉత్తర్వు జారీ అయింది. శుక్రవారం జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ బాధితుడి కుటుంబీకులకు ఎల్వోసీని అందజేశారు. మాజీ సర్పంచి గోపాల్ పాల్గొన్నారు. రాయికోడు మండలం ధర్మాపూర్ గ్రామానికి చెందిన మాణిక్ రెడ్డికి రూ.54 వేలు మంజూరయ్యాయి. ఈ చెక్కును ఖేడ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేష్ షెట్కార్ లబ్ధిదారుడి కుటుంబీకులకు అందజేశారు. నాయకులు సాగర్ షెట్కార్, పీఏసీఎస్ చైర్మన్ మారుతిరెడ్డి పాల్గొన్నారు.
కార్మికుల సేవలు
అభినందనీయం
నారాయణఖేడ్: పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తెల్లవారు జామునుంచే విధుల్లో చేరి కార్మికులు అందించే సేవలు అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ తెలిపారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా శనివారం పారిశుద్ధ్య కార్మికులకు కాస్మోటిక్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులు చేసే కార్మికులు ఆరోగ్యంగా ఉండేందుకు కాస్మోటిక్ కిట్లు దోహదపడతాయన్నారు. అనంతరం పలు వార్డుల్లో జరుగుతున్న పనులు, నీరు నిల్వ ఉన్నచోట్ల దోమలు ప్రబలకుండా ఆయిల్‌బాల్ వేయడం, యాంటీ లార్వా ద్రావణం పిచికారీ పనులను శానిటరీ అధికారి శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు.
నీటి శుద్ధి ప్లాంట్ ప్రారంభం
నారాయణఖేడ్: సంస్కృతి, సంప్రదాయ విద్యతోనే సేవా కార్యక్రమాలు సాధ్యమవుతాయని ఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి అన్నారు. ఖేడ్ శ్రీసరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో దాత జక్కుల యాదగిరి రూ.2 లక్షలతో ఏర్పాటు చేసిన నీటిశుద్ధి ప్లాంటును శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరస్వతీ శిశుమందిరాలు విద్యార్థుల్లో దేశభక్తి, ఆధ్యాత్మికత, నైతిక విలువలను పెంపొందిస్తుండటం గొప్ప విషయమన్నారు. రిటైర్డ్ హెచ్.ఎం రామకృష్ణ, పాఠశాల కమిటీ బాధ్యులు నారాయణ, వీరేశలింగం, చంద్రశేఖర్, శ్రీశైలం, జ్ఞానేశ్వర్, శివరాజ్, సంగమేశ్వర్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల
నిర్మాణం వేగవంతం
హత్నూర( సంగారెడ్డి): ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పనులను త్వరితగతిన కొనసాగించాలని ఎంపీడీవో శంకర్ స్పష్టం చేశారు. మండల కేంద్రమైన హత్నూరలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారుల ఇంటి నిర్మాణం కోసం శుక్రవారం ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శంకర్ మాట్లాడుతూ...అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ ప్రకారం ముగ్గు పోసుకుని పనులు ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఈఓ యూసుఫ్, గ్రామపంచాయతీ కార్యదర్శి మహేశ్, నాయకులు కిష్టయ్య, మధుసూదన్ గౌడ్, నరేందర్, సాయికుమార్ లబ్ధిదారులు పాల్గొన్నారు.
వర్షాలు కురవాలని గంప జాతర
న్యాల్‌కల్(జహీరాబాద్): వర్షాలు కురవాలని కోరుతూ శుక్రవారం మండలంలోని చినిగెపల్లి వాసులు గంప జాతర కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం గ్రామస్తులు భాజా భజంత్రీలతో గ్రామం నుంచి సమీపాన గల చెరువు వద్దకు గంపలతో నైవేద్యాలు తీసుకుని తరలివెళ్లారు. అక్కడ గంగా మాతకు నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

ఎల్వోసీ అందజేత

ఎల్వోసీ అందజేత

ఎల్వోసీ అందజేత