
స్వచ్ఛ బడి బహు బాగు
సిద్దిపేటజోన్: మున్సిపల్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్వచ్ఛ బడి బాగుందని ప్రతినిధులు కితాబిచ్చారు. శనివారం వివిధ రాష్ట్రాల ప్రతినిధులు సిద్దిపేట పట్టణంలో పర్యటించారు. స్వచ్ఛ బడిలో తడి చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీ, డంప్ యార్డు, బయో గ్యాస్, స్లాటర్ హౌస్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. వాటి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, తెలంగాణ, మధ్యప్రదేశ్ అధికారులు, ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పాల్గొన్నారు.