
కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం: హరీశ్‌రావు
జిన్నారం (పటాన్‌చెరు): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని, రైతు భరోసా అందరికీ వేయకుంటే ఓఆర్‌ఆర్ పరిధిలోని 22 వేలమంది రైతులతో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో పటాన్‌చెరు నియోజకవర్గ కన్వీనర్ ఆదర్శ్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రైతుమహాధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 22 వేల రైతులు ఉండగా కేవలం గుమ్మడిదల మండలంలోని కొంత మంది రైతులకు రైతు భరోసా వేయడం సరికాదన్నారు. ఈ రైతు భరోసా అయినా రైతులు నాట్లు వేసుకునేందుకు కాదని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతుల ఓట్లను రాబట్టుకునేందుకే రేవంత్‌రెడ్డి ఆడుతున్న నాటకమని విమర్శించారు. రైతుల ఖాతాల్లో రైతుభరోసా వేయకుంటే ఓఆర్‌ఆర్ పరిధిలోని 22 వేలమంది రైతులతో వంటావార్పు, కలెక్టర్ కార్యాల యం ఎదుట ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ధర్నాలో ఆయనతోపాటు ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాణిక్యరావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.