ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి
కలెక్టర్ వల్లూరు క్రాంతి
సంగారెడ్డి జోన్: ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా అధికారులతో కలిసి అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలను అధికారులకు చెప్పుకున్నారు. కాగా, ప్రజావాణిలో 73 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ...ప్రజా సమస్యలు పెండింగ్‌లో ఉంచకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మాధురి, చంద్రశేఖర్, డీఆర్‌ఓ పద్మజారాణి తదితరులు పాల్గొన్నారు.
నా పేరుపై భూమి మార్చండి
నా భర్త పేరుపై సర్వే నం.101.ఆలో 3.14ఎకరాలు ఉన్న వ్యవసాయ భూమిని నా పేరు మీదికి మార్చాలి. నా భర్త 19 డిసెంబర్ 2020లో మృతి చెందాడు. నా భర్త పేరుపై ఉన్న భూమిని నా పేరు పైకి మార్చాలని దరఖాస్తు చేసుకున్న. ఏళ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదు. అధికారులు చర్యలు తీసుకొని పేరు పైకి భూమిని మార్చాలి.
–తుల్జమ్మ, గ్రా.శేకాపూర్, మం. జహీరాబాద్
ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి


