కవిత్వానికి సమాజమే పునాది
సిద్దిపేటకమాన్: కవిత్వానికి సమాజమే పునాది అని కవి వేణుగోపాల్ అని అన్నారు. మంజీరా రచయితల సంఘం ఆధ్వర్యంలో కవి కిషన్ కవిత్వం పుస్తకాలు పేగు తెగిన పాట, వడిసెల ఆవిష్కరణ సభ నిర్వహించారు. మరసం అధ్యక్షుడు రంగాచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కవి వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కవిత్వానికి సామాజిక నేపథ్యమే పునాదిగా రచనలు చేస్తే ఆ రచన సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. వ్యక్తిగతమైన సాహిత్యం ఎక్కువ కాలం నిలబడేది కాదన్నారు. కవిత్వం మనిషిని మరింత ఉన్నతీకరించడానికి, సమాజంలో మానవ సంబంధాలను పెంపొందించడానికి ఉపయోగపడాలని అన్నారు. కార్యక్రమంలో యాదగిరి, అశోక్, నందిని సిదారెడ్డి, దేశపతి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కవి వేణుగోపాల్


