సాగు అంశాలపై అవగాహన కల్పించడానికే..
● ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం
● వ్యవసాయ కమిషన్ సభ్యుడు రాములు నాయక్
రామాయంపేట(మెదక్): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో రైతులకు అందించడానికి వీలుగా ప్రభుత్వం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమాన్ని చేపట్టిందని వ్యవసాయ కమిషన్ సభ్యుడు రాములు నాయక్ పేర్కొన్నారు. మండలంలోని రాయిలాపూర్ రైతువేదికలో సోమవా రం కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. చిన్నకారు, సన్నకారు రైతుల లభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని, రక్షేత్ర స్థాయిలో రైతుల సమస్యలు గుర్తించి, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి కమిషన్ కృషి చేస్తుందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో జరుగుతున్న పరిశోధన ఫలితాలను రైతులకు వివరించి వారికి చైతన్యపర్చడానికి అవగాహన శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి విన్సెంట్ వినయ్ మా ట్లాడుతూ.. రైతులకు సాంకేతిక సలాహాలను అందిస్తే పెట్టుబడులు తగ్గడంతోపాటు అధిక ఆదా యం పొందే అవకాశం ఉందన్నారు. 13వ తేదీ వరకు కొనసాగే అవగాహన శిబిరాలను రైతులు స ద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శోభారాణి, రామాయంపేట వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు రాజ్‌నారాయణ, డివిజన్ పరిధిలోని వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.


