జహీరాబాద్: జొన్నచొప్ప లోడ్‌తో వెళుతున్న డీసీఎంకు మంటలు అంటుకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మల్‌చల్మ గ్రామానికి చెందిన డీసీఎం యజమాని ఖాలీద్ పట్టణంలోని శాంతినగర్‌కాలనీకి చెందిన నసీర్ వద్ద మంగళవారం సాయంత్రం జొన్నచొప్ప కొనుగోలు చేశాడు. పట్టణంలోని హౌసింగ్‌బోర్డుకాలనీ శివారు నుంచి చొప్ప లోడ్‌తో వెళుతున్న డీసీఎంకు విద్యుత్ తీగలు తగలి షార్ట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. దీంతో పరిసరాల్లో ఉన్న కాలనీవాసులు నీరు పోసి మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం ఫైరింజన్ సహాయంతో మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.40వేల విలువగల చొప్ప దగ్ధమైంది.


