న్యూస్‌రీల్
అక్టోబర్ 13న శిష్యుడు
వీడని దోస్తానీ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఏసీబీ కేసులో అరైస్టె ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్ ఆఫీసు ఏఓ దేశాని శ్రీనివాసరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి మధ్య ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. హయత్‌నగర్ రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తుండగా పదిహేనేళ్ల క్రితం ఇరువురి మధ్య ఏర్పడిన వీరి దోస్తాన్.. కందుకూరులో పనిచేస్తుండగా మరింత బలపడింది. ఇంకేముంది అధికార శ్రీబంధుశ్రీగణంలో వీరిద్దరూ గురుశిష్యులుగా చలామణి అయ్యారు. చేపట్టిన పోస్టింగ్‌ల్లోనే కాదు స్థిరనివాసాలను కూడా పక్కపక్కనే ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లోనూ పక్కపక్క బ్యారకుల్లోనే మగ్గుతున్నారు. ప్రజలకు సేవలు అందించడంలో, విధి నిర్వహణలో పోటీపడాల్సిన అధికారులు ఇరువురూ.. అక్రమార్జనలో పోటీపడ్డారు. అప్పటికే వీరి వద్ద సంపాదనకు, అవసరానికి మించి ఆస్తులు ఉన్నా అత్యాశ చావలేదు. ఇదే వీరి కొంపముంచింది.
ఆగస్టు 20న గురువు..
● ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఏఓ శ్రీనివాసరెడ్డి మొదట్లో చైన్‌మెన్‌గా ఉద్యోగాన్ని ఆరంభించారు. ఆ తర్వాత ఆర్ఐగా, హయత్‌నగర్, కందుకూరు డిప్యూటీ తహసీల్దార్‌గా, బాలాపూర్, శంషాబాద్ మండలాల తహసీల్దార్‌గా పని చేశాడు.
● అసెంబ్లీ ఎన్నికల సమయంలో ల్యాండ్ ప్రొటెక్షన్ వింగ్‌కు బదిలీ అయ్యారు. అక్కడి నుంచి ఇటీవలే ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్ ఆఫీసు అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్‌గా వచ్చాడు.
● అప్పటికే ఇతనిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
● మొదట్లో ఇబ్రహీంపట్నంలో స్ధిరపడిన శ్రీనివాసరెడ్డి ఉన్నత విద్య, పిల్లల భవిష్యత్తు పేరుతో హస్తినాపూర్‌కు మకాం మార్చాడు.
● ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో ఆగస్టు 20న ఇతన్ని అరెస్ట్ చేసిన ఏసీబీ చంచల్‌గూడ జైలుకు తరలించింది.
● ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
● గత 45 రోజులుగా ఆయన జైల్లోనే ఉన్నారు. త్వరలోనే బెయిల్‌పై విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఒకే ‘గూటికి’ గురుశిష్యులు
హయత్‌నగర్, కందుకూరులో బలపడిన బంధం
హస్తినాపూర్‌లో పక్కపక్కనే నివాసాలు
ఆగస్టు 20న గురువు ఏఓ శ్రీనివాసరెడ్డి అరెస్ట్
నాలుగు రోజుల క్రితం ఏసీబీకి దొరికిన శిష్యుడు సుదర్శన్‌రెడ్డి
ప్రస్తుతం ఇద్దరూ ఒకే జైల్లో.. పక్కపక్క బ్యారకుల్లో బందీలుగా ఉన్న వైనం
ఇరువురిపైనా సస్పెన్షన్ వేటు
అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్రెడ్డిది కందుకూరు మండలం జైత్వారం.
కారుణ్య నియామకాల్లో రెవెన్యూ విభాగంలో ఓ సాధారణ చిరుద్యోగిగా విధుల్లోకి అడుగుపెట్టాడు.
జూనియర్ అసిస్టెంట్, వీఆర్ఓ, ఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్, డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్‌గా పదోన్నతులు పొందుతూ అంచలంచెలు ఎదిగాడు.
2025 ఆగస్టు 20న అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించాడు.
గురువు శ్రీనివాసరెడ్డికి తానేమీ తక్కువా అన్నట్లుగా వ్యవహరించాడు.
సీఎం తన మేనమామ అని చెప్పుకుంటూ అడ్డూఅదుపూ లేకుండా అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు.
చివరకు రూ.20 లక్షలు లంచం తీసుకుని అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు.
మూడు రోజుల క్రితం ఇతన్ని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు గురువు ఉన్న చోటికే తరలించారు. ప్రస్తుతం దోస్తులిద్దరూ పక్కపక్క బ్యారకుల్లోనే కుమిలి కుమిలి ఏడున్నారని తెలుస్తోంది.


