పోలీసు వ్యవస్థపై నమ్మకం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

పోలీసు వ్యవస్థపై నమ్మకం పెంచాలి

Oct 15 2026 8:18 AM | Updated on Oct 15 2026 8:18 AM

● డీసీపీ నారాయణరెడ్డి

● కడ్తాల్‌ పీఎస్‌లో తనిఖీలు

కడ్తాల్‌: పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంచాలని, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడొద్దని మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పీఎస్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, లాకప్‌, సీసీ కెమెరాలలు, పరిసరాలను పరిశీలించారు. విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. పెట్రోలింగ్‌, నిఘాను మరింత పటిష్టం చేయాలని సూచించారు. సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ దుష్పరిణామాలపై పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. ఏసీపీ జానకీరెడ్డి, సీఐ సైదిరెడ్డి, ఎప్‌ఐలు రవీందర్‌, చంద్రశేఖర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement